బీహార్ ఫలితాలపై లోతుగా చర్చిస్తాం
ప్రజాస్వామ్య పరిరక్షణకు మరింత కృషి : రాహుల్
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు. బీహార్ ఎన్నికలు మొదటి నుంచి కూడా న్యాయంగా జరగలేదనీ, అందుకే విజయం సాధించలేకపోయామని ఆరోపించారు. ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఫలితాలపై కాంగ్రెస్, ఇండియా బ్లాక్ లోతైన సమీక్ష జరుపుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము మరింతగా కృషి చేస్తామని వివరించారు. మహాగట్‌బంధన్ కూటమి పట్ల విశ్వాసం ఉంచిన లక్షలాది మంది బీహార్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రజా తీర్పును గౌరవిస్తాం : ఖర్గే
బీహార్ ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే శక్తుల పట్ల తాము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సమగ్ర అధ్యయనం జరుపుతామని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రజల్లో ఉంటూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మన పోరాటం కొనసాగుతుందని వివరించారు. తమ పోరాటం నిబద్ధతతో కూడుకొని ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికలు న్యాయంగా జరగలేదు
- Advertisement -
- Advertisement -



