Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ బస్సుల విధానం మార్చాలి

విద్యుత్‌ బస్సుల విధానం మార్చాలి

- Advertisement -

– నేడు, రేపు జాతీయ నిరసన దినాలు
– 20 వరకు సంతకాల సేకరణ

– ఎస్‌డబ్ల్యూఎఫ్‌ పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి, నిధులు, నిర్వహణ, ఆపరేషన్‌ నిర్వహించే అవకాశం ఆర్టీసీకే ఇవ్వాలని, మంగళవారం, బుధవారాల్లో జాతీయ నిరసన నిర్వహించాలని అల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్లూఎఫ్‌) జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ తెలియజేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 18,19,20 తేదీల్లో డిమాండ్లతో కూడిన బ్యానర్‌పై కార్మికులు, ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్రస్థాయి ఆన్‌లైన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్ణయం తీసుకుంది. 18వ తేదీ నాడు ప్రాంతీయ కేంద్రాలలో నిరసన కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలనీ, అలాగే మూడు రోజుల్లో ఆయా డిపో కమిటీలకు వీలు కుదిరిన రోజున చేయాలని పిలుపునిచ్చింది.బానర్‌ పై సంతకాల కార్యక్రమానికి ఆ డిపో పరిధిలో ఉన్న పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానించి చేపట్టాలని కోరింది. అలాగే విద్యుత్‌ బస్సులపై మార్చి 12 న జరిగిన రాష్ట్ర సదస్సు నిర్ణయం మేరకు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చి, విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు కోసం వారి వంతు సహకారం తీసుకోవాలని సూచించారు. ఆర్టీసిలో అనేక సమస్యలు పెరుకుపోయాయనీ, పెరిగిన పనిభారం, వేధింపులు, రెండు వేతన సవరణలు పెండింగ్‌, యూనియన్లను అనుమతించక పోవటం, ఉద్యోగ భద్రత లాంటి అనేక సమస్యలు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేసింది. ఏ సమస్య తీవ్రంగా ముందుకు వస్తుందో దాని పట్ల కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సదా కషి చేస్తుందని వివరించింది. ఉద్యోగ భద్రత కోసం కండక్టర్‌, డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించిన ఏకైక సంఘం ఎస్‌బ్ల్యూఎఫ్‌ మాత్రమేనని గుర్తు చేసింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి విఎస్‌ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -