Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువిద్యుత్ ధరల అదుపునకు నాటి పోరాటమే స్ఫూర్తి

విద్యుత్ ధరల అదుపునకు నాటి పోరాటమే స్ఫూర్తి

- Advertisement -

విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు

నవతెలంగాణ వనపర్తి

2000 సంవత్సరం నుంచి నేటి వరకు విద్యుత్ ధరల అదుపు కావడానికి ఆనాడు విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటమే నేటికీ స్ఫూర్తి కొనసాగుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 28న సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ లో విద్యుత్తు అమరవీరుల చిత్రపటానికి సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ పార్టీ పట్టణ కమిటీ కార్యదర్శి ఎం. పరమేశ్వరాచారి, పట్టణ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగిన విద్యుత్తు పోరాటంలో రామకృష్ణ , విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి మరణించారన్నారు. నూట ముప్పై తొమ్మిది మంది హాస్పిటల్ పాలయ్యారని, 23 మందికి తుపాకీ తూటాలు తగిలాయని అనేక వేలాది మంది ప్రజల పైకి భాష్ప వాయు గోళాలు, నీటి ఫిరంగులు మోగాయని తెలిపారు.

తుపాకి తూటాలు పేల్చారని యుద్ధభూమిగా పోలీసులు మార్చారని దీన్ని తీవ్రంగా సీపీఐ(ఎం) ఖండిస్తుందని అన్నారు. నేటికీ 25 సంవత్సరాలు అవుతున్న విద్యుత్తు చార్జీలు పెరగకుండా ఆ పోరాటం అడ్డుకుందన్నారు. విద్యుత్తు ప్రయివేటీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యుత్తు రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకొని విద్యుత్తు సవరణ చట్టం అమలుకు ప్రయత్నిస్తుందని, అది అమలు అయితే విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెరుగుతాయన్నారు. ప్రయివేటీకరణ జరుగుతుందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడమే విద్యుత్ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన పోరాట ఫలితంగా విద్యుత్తు చార్జీలు పెరగకుండా ఆపగలిగామన్నారు.

నాటి స్ఫూర్తే నేటికీ విద్యుత్తు బారాలు పెరగకుండా ఆపగలిగామని నేడు విద్యుత్ సవరణ చట్టం పేరుతో దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రవేటీకరణకు పూనుకుంటున్న బిజెపి విధానాలను ఎండగట్టాలని ఉచిత విద్యుత్తు ఉండకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కాలం వస్తుందని, గృహ వినియోగదారులకు యూనిట్ 15 రూపాయలు ఖరీదు కట్టే రోజులు వస్తున్నాయని వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడమే విద్యుత్తు అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విద్యుత్తు ప్రయివేటీకరణకు ఆరోజు సిద్ధమైన చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఈబిని ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ డిస్కో లాంటి మూడు విభాగాలుగా విభజించారని ప్రైవేటీకరణ చేసి మొత్తం ప్రజానీకాం పైన భారాలు మోపడానికి సిద్ధమైతే జరిగిన పోరాటమే విద్యుత్తు పోరాటం అని గుర్తు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, ఆర్టీసీ, రైల్వే, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటుకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడమే విద్యుత్ అమరవీరులకి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, పట్టణ నాయకులు డి.కురుమయ్య, ఏ. రమేష్, బి. కురుమయ్య, బీసన్న, సాయిలీల, ఉమా, శాంతమ్మ, రాబర్ట్, జి.బాలస్వామి, గంధం గట్టయ్య, దేవన్న, మద్దిలేటి, నందిమల్ల రాములు, డి. శ్రీనివాసులు, విజయకుమార్, సి. పుల్లయ్య , ఎం.మన్యం, రత్నయ్య, అజయ్, వీ.కృష్ణయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad