నవతెలంగాణ – మల్హర్ రావు : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అదేవిధంగా కొనసాగించాలని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాజా మాజీ ఛైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తొలగించి బిజెపి ప్రభుత్వం విబిజి రాంజీ పథకాన్ని ప్రవేశ పెట్టి ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో ఎలాంటి చర్చ లేకుండా కొత్త చట్టాన్ని తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఉపాధి హామీకి నిధులు ఖర్చు పెట్టాలని షరతులు విధించడం రాష్ట్రాల హక్కును కాలరాయటమేనని అన్నారు. కొత్త ఉపాధిహామీ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటాలకు సిద్ధం కావలని ప్రజలకు పిలుపునిచ్చారు.వలస కూలీలను నివారించేందుకు 2005లో సోనియాగాంధీ నేతృత్వంలో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టారని తెలిపారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.



