కార్మిక సంఘాల నిరసనలు..
సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొడం రమణ, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన అర్హదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీని కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని నినాదాలు చేశారు.
అలాగే రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షించాలని కోరారు. అలాగే టిఆర్ఎస్వి కార్మిక విభాగం ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పలు బీడీ పరిశ్రమలను బందు చేసి కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనాల పెంపు, హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉంచాలని డిమాండ్లతో నిరసనలు తెలిపారు.
బిజెపి ప్రభుత్వం ఈజీఎస్ పథకాన్ని రద్దు చేసి కార్పోరేట్ శక్తులకు ఉపయోగపడేలా చట్టాన్ని తీసుకొచ్చిందని, విపిజి రామ్ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, సిఐటియు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సూరం పద్మ, మండల అధ్యక్షుడు కాసాని రవీందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, చంద్రయ్య ,జానీ ఎల్లవ్వ, రణం పద్మ, అంజవ్వ, కనకవ్వ, పరశురాములు, నరసయ్య, శ్రీనివాస్ , మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, సిపిఐ మండల నాయకుడు బాచుపల్లి శంకర్, రాజేందర్, బాలయ్య, రాములు, మల్లయ్య, శంకర్, ఆనంద్, రవి, గోవింద్ లు పాల్గొన్నారు.



