Tuesday, January 27, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజా ఐక్య ప్రతిఘటనతోనే నిరంకుశ పాలన అంతం

ప్రజా ఐక్య ప్రతిఘటనతోనే నిరంకుశ పాలన అంతం

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కై,ఉద్యోగ ఉపాధి భద్రత కై, మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 న కేంద్ర కార్మిక సంఘాల ఐక్య పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు.  మంగళవారం మున్సిపల్ కమిషనర్ బీ.నాగరాజు కు సంఘం ఆద్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు.హమాలి వర్కర్స్ వ్యాపార సముదాయాల యాజమాన్యాలకు సమ్మె విజయవంతం కై సమ్మె నోటీసులు అందించి విస్తృతంగా ఇస్తూ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. కార్మిక వర్గం తమ సమస్యలపై పని దినాల కోసం సక్రమమైన పని పరిస్థితులు వేతనాల కోసం దుర్భర పరిస్థితులను తొలగించి కనీస హక్కుల కోసం ఆనాటి కార్మిక వర్గం అనేక త్యాగాలతో కార్మిక హక్కులు చట్టాలు సాధిస్తే బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే దానికోసం లేబర్ కోడ్ లు తెచ్చిందని అన్నారు. 

ప్రస్తుత లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తున్న తరుణంలో సమస్త కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటిస్తేనే నిరంకుశ పాలకులు వెనకడుగు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, కామేశ్వరరావు,ఏసు,నాగేంద్ర, సత్యనారాయణ,భూషణం, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -