Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గమంతా హస్తగతం కావాలి: వినయ్ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గమంతా హస్తగతం కావాలి: వినయ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  నియోజకవర్గ నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పట్టణంలోని పి వి ఆర్ భవన్లో సోమవారం  పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ స్థానాలకు ముగ్గురు చొప్పున పేర్ల జాబి తాను రూపొందించాలని ఆదేశించారు. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్  మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్ , ఆలూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్  ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి , డొంకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్ , ఏఎంసీ వైస్ చైర్మన్ ఇస్సపల్లి జీవన్ , పట్టణ మాజీ చైర్మన్ పవన్ పండిట్ , వెంకటరామిరెడ్డి ,మాజీ ఎంపీటీసీ వెంకటేష్ , మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్ ,, లిఫ్ట్ చైర్మన్ భోజ రెడ్డి , జితేందర్ రెడ్డి, మారుతీ రెడ్డి , పీర్ సింగ్ ,మాక్లూర్ యూత్ అధ్యక్షులు వినోద్ ,గంగాధర్ గౌడ్ , గంగారెడ్డి , సాయినాథ్ గౌడ్ , యాళ్ళ సాయి రెడ్డి  చుక్క శ్రీనివాస్  తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -