అమెరికాలో టాప్ లాయర్ రాజీనామా
వాషింగ్టన్ : అమెరికాలో ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ అయిన గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో ముఖ్య న్యాయ సలహాదారుగా ఉన్న కాథీ రూమ్లర్ తన పదవికి రాజీనామా చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆమెకు సంబంధాలున్నాయంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన తాజా దర్యాప్తు పత్రాల్లో రూమ్లర్.. ఎప్‌స్టీన్ నుంచి బహుమతులు స్వీకరించినట్టు, ఆయనకు తన ప్రతిష్టను ఎలా కాపాడుకోవాలో సలహాలు ఇచ్చినట్టు సమాచారం బయటపడింది. ఈ వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఆమె రాజీనామాను కంపెనీ సీఈఓ డేవిడ్ సాల్మన్ ఆమోదించారు.
ఆమె కంపెనీకి మంచి సేవలు అందించిందని చెప్పారు. రూమ్లర్ గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా పాలనలో వైట్‌హౌస్ న్యాయ సలహాదారుగా కూడా పని చేశారు. మీడియా దృష్టి తనపై ఎక్కువ ఉండటం కారణంగా సంస్థ పనులకు ఆటంకం కలుగుతోందని భావించి రాజీనామా చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అమెరికాతో పాటు భారత్ వంటి దేశాల్లోనూ ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి. ఎప్‌స్టీన్ కేసుతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేయడం, దర్యాప్తును ఎదుర్కోవడం జరుగుతోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం కూడా ఈ కేసుతో సంబంధం ఉన్న వివాదాల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ఎప్‌స్టీన్‌తో సంబంధాల వ్యవహారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



