Monday, December 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కొలువుదీరిన సర్పంచ్ పాలకవర్గలు 

కొలువుదీరిన సర్పంచ్ పాలకవర్గలు 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని 42గ్రామ పంచాయతీ పరిధి లో సోమవారం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ సభ్యుల పాలకవర్గలు ఏర్పాటుయ్యాయి. మండల కేంద్రమైన కుభీర్ సర్పంచ్ కందురు సాయినాథ్ తో పాటు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులను ఎంపీడీఓ సాగర్ రెడ్డి అధ్యక్షతన ప్రమాణ స్వీకారం జరిగింది. నూతనంగా ఏర్పడిన ప్రమాణ స్వీకారం చేపట్టిన సర్పంచు అధికారికంగా గ్రామంలో పలు అభివృద్ది పనులకు స్వీకారం చుట్టారు. ఈ సందర్బంగా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ.. తమపై నమ్మకం తో ఓటు వేసిన ప్రజలకు  ఎల్లపుడు అందుబాటులో ఉండి సేవాలాందిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చూచా తప్పకుండ నెరవేరుస్తన్నారు. కులమాత బేదాలకు అతీతంగా గ్రామ అభివృద్దె లక్షంగా పని చేస్తామని పేర్కొన్నారు. మండలంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గ ప్రమాణ స్వీకరా కార్యక్రమానికి  గ్రామస్తులు భారీగా వచ్చి పాలకవర్గాన్నికి శాలవా పూల మాలల తో ఘనంగా సన్మాంచారు. 

ఫార్డి (బి ) ప్రమాణ స్వీకారోత్సవానికి పోటెత్తిన గ్రామస్తులు
మండలంలోని ఫార్డి బి గ్రామ పంచాయతి ఎన్నికలు హారహోరిగా జరిగిన విషయం తెలిసిందే చివరి వరకు ఉత్కంఠ సాగిన ఎన్నికల్లో 32 ఏండ్ల యువకుడ మడి ప్రవీణ్  భారీ మెజార్టీ తో గెలుపొందారు. కాగా సోమవారం నూతన పాలక వర్గ ప్రమాణ స్వకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. గ్రామంలోని సుమారు 1000 మంది ప్రజలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేశారు. మండలంలోని ఫార్డి బి గ్రామపంచాయతీ నిలుపుతానని సర్పంచ్  మడి ప్రవీణ్ అన్నారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -