Sunday, May 11, 2025
Homeకవితనిత్య శ్రామికురాలు - అమ్మ

నిత్య శ్రామికురాలు – అమ్మ

- Advertisement -

అమ్మ నిత్య శ్రామికురాలు! అలుపెరుగని సేవకురాలు!
ఎవరో చేసిన చట్టాలు ఆమెకు వర్తించవు!
బరువు బాధ్యతలే తప్ప ఏ నాడు ఆమె హక్కులను అనుభవించదు!
పొగ సూరిన వంట గదిలో మసి బారడమే ఆమెకున్న జన్మ హక్కు!
బట్టలు ఉతకడంలో సిద్దహస్తురాలైన ఆమెకు మించిన మరో వాషింగ్‌ మిషన్‌ మార్కెట్లో దొరకదు!
అంట్లు తోమి గిన్నెలను మెరిపించడంలో ఆమెకున్న ప్రతిభను ఎవరు నిలదీయలేరు!
వంట గదిలో ఆమె అలికిడిని వినేందుకు ఆమె చేతి గాజులే సాక్ష్యం!
కాళ్ళకున్న మెట్టెల సవ్వడితోనే ఆమె ఉనికిని గుర్తు పట్టడం సాధ్యం!
విరామం లేకుండా ఇల్లంతా కలియ తిరిగే ఆమె మర యంత్రాన్ని మరిపించును!
పని ఒత్తిడిలో ఉన్నప్పుడు నిద్రాహారాలు మరిచి పోయే ఆమె
ఒంటి పూట ఉపవాసాలతో గడుపుతుంది నెలలోని సగం రోజులు!
శ్రమకోర్చి అంకిత భావంతో పనిచేసే అమ్మ సేవలను గుర్తించలేని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తూ
సూటి పోటీమాటలతో అవమానిస్తూ సన్మానాలు చేస్తూ సత్కరిస్తాం!
అమ్మను గౌరవించే ఇంగిత జ్ఞానం లేని మనకు అమ్మతో ఎలా మెలగాలో తెలియదు!
అయినా అమ్మ చిన్నబుచ్చుకోకుండా నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది
విశ్రమించకుండా సేవలు అందిస్తూనే ఉంటుంది!
అందుకే గొప్ప మనసున్న అమ్మకు వందనం! అభివందనం!!

  • ఎస్‌.జవేరియా, 9849931255
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -