Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూలీ ముఖమే.. గుర్తింపు.!

కూలీ ముఖమే.. గుర్తింపు.!

- Advertisement -

నూతన యాప్ తో ఫేస్ రెండుసార్లు అటెండెన్స్
నవతెలంగాణ – మల్హర్ రావు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మస్టర్లలో అక్రమాలకు తావులేకుండా, అర్హులైన కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా కేంద్రప్రభుత్వం ‘ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్’ (ఎస్ఆర్ఎస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. కూలీల హాజరును ఎస్ఆర్ఎస్ ద్వారా నమోదు చేస్తున్నారు.మండలంలో ఉపాధిహామీ పనులు కోమసాగుతున్నాయి.

ఈ కొత్త యాప్ ప్రక్రియను పని ప్రదేశాల్లో ఉన్న కూలీలకే హాజరు నమోదుకానుంది.గతంలో పనిప్రదేశాల్లో కూలీలను బృందంగా ఫొటో తీసి ఎన్ఎం ఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేసేవారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఆర్ ఎస్. విధానంతో ప్రతి కూలీ ముఖాన్ని ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.అలా చేసిన వారికే హాజరు నమోదై వేతనం అందనుంది.అలాగే, ఒకరి పేరిట మరొకరు హాజరు వేయించు కునే విధానానికి అడ్డుకట్ట పడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆన్లైన్ హాజరు వేయాల్సి ఉండడం భారంగా మారుతోందని ఉపాధిహామీ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మండలం లో మొత్తం జాబ్ కార్డులు 8,495,ఇందులో మొత్తం కూలీలు 18873,యాక్టివ్ కూలీలు 10632, ఉన్నారు.2025-26 పనిదినాల లక్ష్యం 77,708.

సమస్యలు అధిగమించేలా..

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య హాజరు నమోదుకు అవరోధంగా మారుతోందని తెలుస్తోంది.పని ప్రదేశంలో కూలీల ఫొటోలు తీసుకుని, సిగ్నల్ ఉన్న చోటుకు వెళ్లాక డేటా అప్ లోడ్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, రెండు సార్లు కూలీ ముఖాన్ని ఫొటో తీసి అప్ లోడ్ చేయాల్సి ఉండగా..రెండింటి మధ్య నాలుగు గంటలు సమయం వ్యత్యాసం ఉండాలనే నిబంధన విధించారు. అయితే, కూలీలు హాజరు పెరిగితే సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఇలా రెండు సార్లు దూరం వెళ్లి నమోదు చేసి రావడానికి ఇబ్బందులు తప్పవని సిబ్బంది. చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -