జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తథ్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని తెలంగాణలోనూ కొనసాగిస్తున్నామని సీఎం అన్నారు. ”బీఆర్‌ఎస్‌ను బీజేపీకి తాకట్టుపెట్టారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా స్పందించలేదు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, గులాబీ పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ఎందుకు అనుమతివ్వరు? ఆ పార్టీ బీజేపీలో విలీనమవుతుందనే విషయం గతంలోనే కవిత చెప్పారు. రెండు పార్టీలు కుమ్మక్కై జూబ్లీహిల్స్‌లో ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు” అని సీఎం విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్‌ఎస్ అబద్దపు ప్రచారాలు మానలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా పాస్టర్లు సీఎంకు తెలిపారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తథ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



