Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయందిగొచ్చిన పసిడి

దిగొచ్చిన పసిడి

- Advertisement -

ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,800
కిలో వెండి రూ.1.58 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర భారీగా దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10వేల మేర తగ్గింది. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,800కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,483కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,58,000కు చేరుకుంది. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు క్రమంగా ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం కూడా ప్రస్తుతం గోల్డ్‌ రేటు తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్‌ స్పాట్‌ గోల్డ్‌ (31.10 గ్రాములు) ధర ఏకంగా 2497 డాలర్లు క్షీణించింది. దీంతో ఔన్స్‌ గోల్డ్‌ ధర 4045 డాలర్లకు చేరింది. ఇక స్పాట్‌ వెండి ధర కూడా 3.9 డాలర్లు తగ్గి 47.84 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ధరలు తగ్గడం అలా అరుదుగా జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2013 తర్వాతే ఇంతగా పతనం అవ్వడం ఇప్పడేనని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధర 60 శాతానికి పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. త్వరలోనే ఔన్స్‌ బంగారం ధర ఏకంగా 5,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని భావించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

అయితే మంగళవారం లాభాల స్వీకరణతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగి, ధరలు 6 శాతం వరకు పడిపోయాయి. బుధవారం ఆసియా మార్కెట్లలో కూడా ఈ పతనం కొనసాగింది. ఒక దశలో బంగారం ఔన్సు ధర 4,000 డాలర్ల వరకు తగ్గింది. వెండి కూడా అదే దారిలో నష్టపోయింది. దీని ప్రభావం బంగారం ఉత్పత్తిదారుల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ఇక ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌, షాంఘై, సిడ్నీ, వెల్లింగ్టన్‌, తైపీ, మనీలా సూచీలు నష్టపోయాయి. ఇక బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. తగ్గినా కూడా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -