– పొలం వద్ద రక్తపు గాయాలతో మృతదేహం
– వికారాబాద్ జిల్లా బిల్కల్‌లో ఘటన
నవతెలంగాణ-మర్పల్లి
పొలంలో అనుమానాస్పదంగా రైతు హత్యకు గురైన ఘటన వికారా బాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో కలకలం రేపింది. పోలీసుల వివ రాల ప్రకారం.. బిల్కల్ గ్రామానికి చెందిన నర్సింలు (39), వసంత దంప తులు. వీరు వ్యవసాయం, కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేండ్లుగా అదే గ్రామానికి చెందిన బ్యాగరి నర్సమ్మతో నర్సింలుకు వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల నర్సింలు ఆ మహిళను కలవడం తగ్గించడంతో బెదిరింపులు, ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులు ఎక్కువయ్యాయి. గురువారం ఉదయం నుంచి సాయం త్రం వరకు ఇంట్లోనే ఉన్న నర్సింలు రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య జొన్నచేను చూసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. అనంతరం అతడి ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతకగా, బిల్కల్ శివారులోని సర్వే నెం.166లో రక్తపు గాయాలతో విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుని కుటంబీకులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీ రయ్యారు. మృతుని ముఖం, తల భాగంపై బలమైన గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు బ్యాగరి నర్సమ్మ, పాపయ్యలే కారణమని మృతుని భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు.
రైతు దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



