Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ పరిశీలనలో ఫీ రెగ్యులేటరీ అంశం

ప్రభుత్వ పరిశీలనలో ఫీ రెగ్యులేటరీ అంశం

- Advertisement -

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్కూల్స్‌లో ఫీ రెగ్యులేటరీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ఫీ రెగ్యులేటరీ కమిటీ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ కలిసి వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌లో ఫీజుల పెంపుదల ఇష్టానుసారంగా ఉందనీ, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా నిర్ణయిస్తున్నారనీ, బయటి పరిస్థితులతో సంబంధం లేకుండా 15 శాతం నుంచి 40 శాతం వరకు పెంచుతున్నారని వారు తెలిపారు. అందుబాటులో లేని వ్యక్తులను పేరెంట్‌ టీచర్‌ అసోసియేషన్‌ లో పెట్టుకుని, సీబీఎస్‌ ఈ బోర్డును, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.

ఫీజుల పెంచే ముందు దానికి సంబంధించిన లెక్కలు, ఖర్చుల వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. లెక్కలు లేకుండా పెంచిన ఫీజులపై సమగ్ర విచారణ జరపాలని, ప్రభుత్వ ఫీ రెగ్యులేషన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వారు కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఫీ రెగ్యులేటరీ అంశంపై ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ తీవ్రంగా కృషి చేస్తుందనీ, విద్యాశాఖ కసరత్తు చేస్తుందని బదులిచ్చారు. వెంటనే విద్యా శాఖ కమిషనర్‌ డా.నవీన్‌ నికోలస్‌తో ఫోన్‌ లో సంప్రదింపులు జరిపి తగిన సూచనలు చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ సొసైటీలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బేగంపేట, రామంతాపూర్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -