పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు
నవతెలంగాణ – గండీడ్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని, వెన్నాచేడ్, పగిడ్యాల్ తదితర గ్రామాల్లో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోయిని గోపాల్ మాట్లాడుతూ అత్యంత ధీరునిగా, సాహసవంతునిగా ఎదిగిన సాయన్న చిన్ననాటి నుంచి అన్యాయాలను ఎదిరించి, పేదల పక్షాన నిలబడ్డాడని కొనియాడారు. అంతేకాకుండా ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు ఎదురు తిరిగి అక్రమంగా దోచుకున్న ధాన్యాన్ని ధనాన్ని నా దగ్గర దాచుకోకుండా పేదలకు పంచిపెట్టిన వీరుడన్నారు. కార్యక్రమంలో కార్యదర్శిలు బంటు ఆంజనేయులు, కేశవులు, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, బంటు నరసప్ప, ఏవి రాములు, సాయిలు, వెంకటయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.
బహుజన వీరుడు పండుగ సాయన్న..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES