నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై భార్గవ్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం రోజు ఆయా గ్రామాలకు చెందిన యువకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాల పేర్లను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశానుసారం మండపాల వద్ద గాని నిమజ్జన సమయంలో గానీ డీజేలకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. డీజే వాడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి చిన్నపిల్లలు డీజే శబ్ద కాలుష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని హైకోర్టు గమనించి రాష్ట్రవ్యాప్తంగా డీజేలకు అనుమతి ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా డీజే నిర్వహణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పండగను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES