Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండగను సఖ్యాత వాతావరణంలో నిర్వహించుకోవాలి

పండగను సఖ్యాత వాతావరణంలో నిర్వహించుకోవాలి

- Advertisement -

– కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగను సఖ్యతా వాతావరణంలో, శాంతి భద్రతలతో నిర్వహించుకోవాలని ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో వినాయక చవితి పండుగను సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్ఐ అనిల్ రెడ్డి, తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఎలక్ట్రికల్  ఏఈ  అన్నయ, మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ స్వామి గణేష్ మండల నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ విగ్రహాలను తరలించే సమయంలో కరెంట్ వైర్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, మండపం స్టేజీని పకడ్బంధీగా ఏర్పాటు చేసి ఎలాంటి ఆపశృతికి తావివ్వకుండా చూసుకోవాలన్నారు.

పండుగను సఖ్యతా వాతావరణంలో, శాంతి భద్రతలతో నిర్వహించుకోవాలని సూచించారు.పండుగ సమయంలో మద్యం సేవించడం, డీజే సౌండ్ వ్యవస్థలు ఉపయోగించడం, రాత్రి వేళల్లో అధిక శబ్ధం చేయడం, రోడ్లపై రవాణాకు అంతరాయం కలిగించడం వంటి కార్యకలాపాలు చేయరాదన్నారు.పోలీసులకు ప్రజలందరూ సహకరించి పండుగను సాఫీగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆయా గ్రామాలకు చెందిన సుమారు 350 మంది పైగా గణేష్ మండళ్ల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -