– క్యూబన్ రాయబార కార్యాలయ కార్యదర్శి మైకీ డియాజ్ పెరెజ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫెడెల్ కాస్ట్రో సెంటెనరీ ఫుట్‌బాల్ కప్ పోటీలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నాడిక్కడ ఇండియాలోని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్, క్యూబన్ రాయబార కార్యాలయం మొదటి కార్యదర్శి మైకీ డియాజ్ పెరెజ్ అధికారికంగా ప్రారంభించారు. క్యూబన్ మిషన్ నుంచి ఇతర దౌత్యవేత్తలు కూడా ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అంతర్జాతీయ స్నేహం, సంఘీభావం శక్తివంతమైన క్షణాన్ని స్పష్టం చేస్తోంది. క్యూబన్ సాలిడారిటీ కమిటీ నుంచి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, సీపీఐ(ఎం) నేతలు విజయన్, అనురాగ్ సక్సేనా, సుబీర్ బెనర్జీ, అమన్, సూరజ్, ఐషే, రిక్తా పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో భాగంగా నాలుగు యాక్షన్-ప్యాక్డ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఢిల్లీ, రాజస్థాన్ అంతటా 32 యువ జట్లు పోటీ పడ్డాయి.
ఈ ఫుట్‌బాల్ కప్‌ను ఫెడెల్ కాస్ట్రో విప్లవాత్మక వారసత్వాన్ని గౌరవించడానికే కాక, ఆయన శతాబ్ది వార్సికోత్సవాల సందర్భంగా క్యూబా ప్రజలతో సంఘీభావంగా నిలబడటానికి నిర్వహిస్తున్నట్టు నేతలు తెలిపారు. క్రీడ మనల్ని ఏకం చేసే, అణగారిన వారిని ఆదుకునే ప్రతిఘటన, ఆశ అని, వంతెనలను నిర్మించే ప్రపంచాన్ని నిర్మించాలనే ఫెడెల్ కాస్ట్రో శాశ్వత కలకి ఇది నివాళి అని వారు పేర్కొన్నారు. నేటికీ, దశాబ్దాలుగా కఠినమైన అమెరికా ఆంక్షలు, పరిమిత సహజ వనరులు ఉన్నప్పటికీ, క్యూబా అందరికీ ఉచిత విద్య, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, క్రీడా శిక్షణను అందిస్తూనే ఉందన్నారు. క్యూబా ప్రజల మాదిరిగానే తాము కూడా అదే కలలు, ఆకాంక్షలను పంచుకుంటామని తెలిపారు. ఈ టోర్నమెంట్‌తో సమానత్వం, ఐక్యత, అంతర్జాతీయ సంఘీభావంతో ఉన్న ప్రపంచాన్ని నిర్మించడానికి తమ నిబద్ధతను తాము పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు.
ఘనంగా ఫెడెల్ కాస్ట్రో శతాబ్ది ఫుట్‌బాల్ కప్ పోటీలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -