కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల పై ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకుడు. మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. శనివారం ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు.
హీరో మణికాంత్ మాట్లాడుతూ, ‘నన్ను హీరోని చేయాలని ఈ సినిమా కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు. మధ్యలో ఇరుక్కుపోయిన మమ్మల్ని రమేష్ ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఇందులోని ప్రతీ డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
‘అశ్వనీదత్, సంపత్ నంది వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఓ సందేశాత్మకంగా చిత్రంగా దీన్ని తెరకెక్కించాం.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. టైటిల్ రోల్‌లో మణికాంత్ నటించారు. సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. గౌతమ్ సంగీతం అద్భుతంగా వచ్చింది. విశ్వనాథ్ ఎడిటింగ్ బాగా కుదిరింది. నర్సింహ గౌడ్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో యాక్షన్, మాస్, కమర్షియల్, మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉన్న ఈ సబ్జెక్ట్ చెప్పాను. తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు. మా మూవీని అందరూ ఆశీర్వదించండి’ అని దర్శకుడు ప్రభాస్ నిమ్మల అన్నారు.
‘నేను చాలా కథలు విన్నాను. ఓ టైంలో ప్రభాస్ ఈ ‘ఫైటర్ శివ’ స్టోరీ చెప్పారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిం చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొపేలా మా చిత్రం ఉంటుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని నిర్మాత నర్సింహా గౌడ్ అన్నారు. మరో నిర్మాత ఉన్నం రమేష్ మాట్లాడుతూ, ‘డ్రగ్స్ నిర్మూలించాలనే ప్రభుత్వ పోరాటాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను మా దర్శకుడు తెరకెక్కించారు. మణికాంత్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ‘ఫైటర్ శివ’ పెద్ద విజయం సాధిస్తుంది’ అని తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలనపై పోరాటం
- Advertisement -
- Advertisement -