Monday, July 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎమ్మెల్సీల జగడం

ఎమ్మెల్సీల జగడం

- Advertisement -

తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి
గన్‌మెన్‌ కాల్పులు
కవితనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ
దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరన్న మల్లన్న
నవతెలంగాణ-ఉప్పల్‌

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆఫీసు (క్యూ న్యూస్‌)పై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితను ద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆదివారం మేడ్చల్‌ జిల్లా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బోడుప్పల్‌లోని ఆయన కార్యాలయం, సిబ్బందిపై జాగృతి కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డుకోబో యిన గన్‌మెన్‌ల పైనా దాడికి పాల్పడ్డారు. దాంతో మల్లన్నను కాపాడాలని గన్‌మెన్‌ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఆఫీసులో గ్లాస్‌ ఫర్నిచర్‌ పెచ్చులు గుచ్చుకుని ఇరువర్గాలకు గాయాలు కావడంతో ఆఫీసు మొత్తం రక్తంతో నిండిపోయింది. సిబ్బంది స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.


నా మీద హత్యాయత్నం చేస్తారా.. ఇక తేల్చుకుదాం : ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న
క్యూ న్యూస్‌ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న స్పందించారు. ఆఫీస్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడతాడనుకు ంటే.. భ్రమే అవుతుందని తెలిపారు. తన గన్‌మెన్‌ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని మరీ సిబ్బందిపై దాడి చేశారని, తనతో సహా పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపించారు. ఇక
ఊరుకోబోమని హెచ్చరించారు. తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘కంచం-మంచం’ అనేది తెలంగాణలో ఊతపదమని, తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని తెలిపారు. తానేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారని, రౌడీల్లా దాడి చేయడమే కాకుండా.. ఎదురు కేసు పెట్టారన్నారు. తన రక్తం కండ్ల్లజూశారని, ఆ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తానన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని కోరారు. ఈ దాడిపై ఇప్పటికే కంప్లైంట్‌ చేశామని, పోలీసులపై, వ్యవస్థపైనా నమ్మకముందని, న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -