– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు మద్దతు
నవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్
పోరాటాలు చేయడం వల్లే సమస్యలపై పాలకులు స్పందిస్తారని, ఇది చారిత్రక సత్యమని.. న్యాయం జరిగే వరకూ పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని జూలకంటి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్నికలకు ముందు నాడు అన్ని ఉద్యమాల్లో పాల్గొని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించారని విమర్శించారు. విద్యుత్ సంస్థ లాభాల్లో నడవడానికి ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న 14 గంటల పని విధానమేనని చెప్పారు. కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కావని, వారి డిమాండ్లను అంగీకరించి సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మందికిపైగా ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారని, వారందరిని రెగ్యులర్ చేస్తామని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని అది నేటికీ అమలు కాలేదని అన్నారు. ఆర్టిజన్ల సమ్మెకు ప్రజాదరణ ఉందని, దీన్ని గమనించి ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు డబ్బికార్ మల్లేష్, గౌతమ్ రెడ్డి, మంగారెడ్డి రవి నాయక్, సైదులు, ఆర్టిజన్ నాయకులు అశోక్, మధు, ఆనంద్, షఫీ ఖాన్, దేవేందర్ రెడ్డి, లలిత తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



