Thursday, November 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజర్నలిజం కోసం పోరాటం తప్పదు

జర్నలిజం కోసం పోరాటం తప్పదు

- Advertisement -

ట్రంప్‌ బెదిరింపుల నడుమ బీబీసీ చీఫ్‌ పిలుపు

వాషింగ్టన్‌ : జర్నలిజం కోసం పోరాటం తప్పదని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న బీబీసీ చీఫ్‌ టిమ్‌ డేవీ అన్నారు. బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వేసిన దావా బెదిరింపుల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ‘మన జర్నలిజం కోసం తప్పక పోరాడాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. బీబీసీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్‌ చేసినందుకు వ్యతిరేకంగా సుమారు రూ.8,300 కోట్లు పరిహారం డిమాండ్‌ చేస్తూ ట్రంప్‌ న్యాయవాదులు నోటీసులు పంపారు. ”మన మీద ఒత్తిడి పెరుగుతోంది. జర్నలిజాన్ని ఆయుధంగా వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మన విలువలను కాపాడుకోవాలి” అని టిమ్‌ డేవీ అన్నారు.

ఇప్పటికే బీబీసీ న్యూస్‌ సీఈఓ డెబోరా టర్నెస్‌ కూడా ఈ వివాదం నడుమ రాజీనామా చేసిన విషయం విదితమే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత టిమ్‌ డేవీపై విధంగా స్పందించినట్టు తెలుస్తున్నది. బీబీసీ లాంటి ఒక అంతర్జాతీయ వార్తాసంస్థపై ట్రంప్‌ తాజా బెదిరింపులు ఇటు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారాయి. యూకేలోని స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ ప్రభుత్వం బీబీసీ స్వతంత్రతను కాపాడాలనే ధోరణిలో ఉన్నది. అయితే ఇవి అమెరికాతో సంబంధాలపై ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా యూకే సాంస్కృతిక మంత్రి లిసా నాండీ పార్లమెంట్‌లో ఈ వివాదంపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -