Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ ఇలాకాలో హక్కుల పోరాటం

మోడీ ఇలాకాలో హక్కుల పోరాటం

- Advertisement -

వీధుల్లోకి వచ్చి అంగన్‌వాడీల భారీ నిరసన
బీజేపీ పాలిత గుజరాత్‌లో డిమాండ్ల కోసం గళమెత్తిన కార్మికులు


అహ్మదాబాద్‌ : మోడీ ఇలాకాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్మికులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం సీఐటీయూ అనుబంధ గుజరాత్‌ అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్‌ పిలుపు మేరకు..హక్కులకోసం ఉద్యమించారు. అంగన్‌వాడీ కార్మికులు , సహాయకులకు కనీస వేతనాలపై గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని తప్పుబట్టారు. పదవీ విరమణ వయస్సు పెంపు , పని ప్రయోజనాల కోసం మొబైల్‌ ఫోన్‌ల పంపిణీతో పాటు ఇతర పరిష్కారం కాని డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పదే పదే నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నా..బీజేపీ పాలిత ప్రభుత్వం చర్చలకు సంసిద్ధతను చూపటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 1-10 వరకు వెయ్యిమంది అంగన్‌వాడీ కార్మికులతో నిరాహార దీక్ష చేపట్టి.. తమ నిరసనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -