Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకంట్రిబ్యూషన్‌ చెల్లింపు రద్దు కోసం పోరాటం

కంట్రిబ్యూషన్‌ చెల్లింపు రద్దు కోసం పోరాటం

- Advertisement -

తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కొత్త ఈహెచ్‌ఎస్‌ పథకంలో ఉద్యోగుల మూలవేతనం నుంచి ఒకటిన్నర శాతం కంట్రిబ్యూషన్‌ చెల్లింపు రద్దు కోసం ఇతర సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి ఆర్‌.రోహిత్‌ నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మగౌరవం, విలువలు ఉన్న నాయకులెవరూ కొత్త ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని అంగీకరించరని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించడం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత అనీ, అది విస్మరించి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వంత పాడటం దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఘట్టమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -