– సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16న ఢిల్లీలో అఖిల భారత సదస్సు
– మోడీ విధానాలను ఓడిచేందుకు క్షేత్ర స్థాయిలో శ్రామిక వర్గాల ఐక్యత : ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రామిక ప్రజల వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించేందుకు, దేశవ్యాప్తంగా ఉమ్మడి ఉద్యమలను ఉధృతం చేసేందుకు సెప్టెంబర్ 16న ఢిల్లీలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి గా అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. సోమవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, కమ్యూనల్ విధానాలకు వ్యతిరేకంగా ఉత్పత్తిలో కీలకమైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, వృత్తి దారులు, గ్రామీణ పట్టణ పేదలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి లేబర్ కోడ్స్ తెచ్చిందని, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని అన్నారు. వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు ఉపాధి హామీని కేంద్రం బలహీన పరిచిందని, బడ్జెట్ లో కేటాయింపుకు భారీగా కోతలు విధించారని అన్నారు. ఆధార్ కార్డు అనుసంధానం పేరుతో 7 కోట్ల లబ్దిదారులను ప్రభుత్వం రద్దు చేసిందని, రెండు పూటలా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిందని విమర్శించారు. పేదల భూ పంపిణీ చేయకపోగా ఉన్న భూములను అభివృద్ధి పేరుతో బలవంతంగా ప్రభుత్వమే లాక్కోవడం చేస్తుందని విమర్శించారు.
కార్మిక, కర్షక హక్కుల రక్షణకై పోరాటం
- Advertisement -
- Advertisement -