Monday, November 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలునా కెరీర్‌లో గర్వపడే సినిమా : హీరో రామ్‌ పోతినేని

నా కెరీర్‌లో గర్వపడే సినిమా : హీరో రామ్‌ పోతినేని

- Advertisement -

హీరో రామ్‌ పోతినేని మోస్ట్‌ ఎవైటెడ్‌ యూనిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’తో అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ఆన్‌-స్క్రీన్‌ సూపర్‌స్టార్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల27న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ వైజాగ్‌లో మ్యూజిక్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. ఈ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌లో హీరో రామ్‌ మైండ్‌ బ్లోయింగ్‌ ఎనర్జిటిక్‌ సింగింగ్‌ పెర్ఫార్మెన్స్‌ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో గర్వపడే సినిమా ఇది. రవి, నవీన్‌ చాలా ప్యాషన్‌ ఉన్న ప్రొడ్యూసర్స్‌. వివేక్‌, మార్విన్‌ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్‌ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్‌ గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్‌తో పాటు మంచి పర్ఫార్మ్‌ చేసే హీరోయిన్‌ భాగ్యశ్రీ వచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు దర్శకుడు మహేష్‌ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్‌ చేయడం మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఎక్స్పీరియన్స్‌. ఉపేంద్రతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.

మై డియర్‌ ఫ్యాన్స్‌..జీవితంలో పైకి రావాలంటే ప్యాషన్‌, పర్పస్‌ ఉండాలి. నా పర్పస్‌ మీరే’ అని తెలిపారు. ”ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు’ ఈ సినిమాలన్నీ మీకు గుర్తు ఉండటం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి, మీరు అందరూ కాలర్‌ ఎగరేసు కుంటూ బయటికి వస్తారు. మహేష్‌ సినిమాని అద్భుతంగా చేశారు’ అని ఉపేంద్ర అన్నారు. హీరోయిన్‌ భాగ్యశ్రీ మాట్లాడుతూ, ‘నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్‌ అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు’ అని చెప్పారు. ‘నిర్మాత రవికి కథ చెప్పినప్పుడు ఆయన నన్ను హగ్‌ చేసుకున్నారు. అప్పుడే కంటెంట్‌ మీద మరింత నమ్మకం వచ్చింది. ఒక డైరెక్టర్‌ని డైరెక్ట్‌ చేయడం చాలా కష్టమైన పని. ఉపేంద్ర దగ్గరికి చాలా భయంతో వెళ్ళాను. ఆయన రియల్‌ మాన్‌. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. రామ్‌ లేకపోతే సినిమా లేదు. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్‌లో ఎన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయో ఒక ఫ్యాన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా’ అని డైరెక్టర్‌ మహేష్‌ బాబు చెప్పారు.

ఇదే వైజాగ్‌లో మేం చేసిన ‘రంగస్థలం’ ఈవెంట్‌ గుర్తుకొస్తుంది. ఆ రోజు ఈవెంట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇదే వేదికలో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. హీరో రామ్‌ అభిమానులందరు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్‌లో చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో రామ్‌, ఉపేంద్ర మధ్య ఉండే సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. అలాగే భాగ్యశ్రీ, రాహుల్‌ రామకష్ణ అన్ని క్యారెక్టర్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఒక మెసేజ్‌ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో దర్శకుడు కొట్టాల శివ దిట్ట . ఈ సినిమా దర్శకుడు మహేష్‌ కూడా నెక్స్ట్‌ కొరటాల శివ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. అందరు స్టార్‌ ఫ్యాన్స్‌ని కలిపిన సినిమా ఇది. -నిర్మాత రవి శంకర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -