Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుర‌జాకార్ చిత్రం చారిత్ర‌క చిత్రం కాదు..బీజేపీ రాజకీయ ఎజెండా : దర్శకుడు వేణు ఉడుగుల

ర‌జాకార్ చిత్రం చారిత్ర‌క చిత్రం కాదు..బీజేపీ రాజకీయ ఎజెండా : దర్శకుడు వేణు ఉడుగుల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ‘రజాకార్’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ఈ సినిమా, భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ ఎజెండాలో భాగమని ఆయన ఆరోపించారు.

‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ అంటూ వ‌చ్చిన ఈ చిత్రానికి యాటా స‌త్య నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. బీజేపీ నేత గూడురు నారాయ‌ణ రెడ్డి నిర్మించాడు. గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై తాజాగా ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల స్పందిస్తూ ర‌జాకార్ చిత్రం చారిత్ర‌క చిత్రం కాద‌ని.. ఇది బీజేపీ రాజకీయ ఎజెండా సినిమా అని తెలిపాడు.

”రజాకార్ సినిమాను కేవలం చరిత్ర చెప్పడానికి మాత్రమే తీయలేదు. దీని వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశం ఉంది. ఇది బీజేపీ యొక్క రాజకీయ ఎజెండాకు మద్దతు ఇచ్చే విధంగా రూపొందించబడింది. చ‌రిత్ర‌ను చెప్పాలంటే మాన‌వీయ‌కోణంలో చెప్పాలి. కానీ ఒక క‌మ్యూనిటీని టార్గెట్ చేసి వారిని నెగిటివ్‌గా చూపించారు. రాజాకార్లంటే కేవ‌లం ముస్లింలే లేరు. ఈ సినిమా తీసిన‌ప్పుడు చ‌రిత్ర గురించి తెలుసుకుని తీయాల్సింది. సాయుధ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు వ‌దిలారు. ఈ ఘ‌ట‌న‌ల గురించి చెప్ప‌డానికి చాలామంది చ‌రిత్ర‌కారులు ఇప్ప‌టికి బ్ర‌తికిఉన్నారు. కానీ ఎవరిని సంప్ర‌దించ‌కుండా ఒక ఎజెండాతో ఈ సినిమాను తెర‌కెక్కించారంటూ” వేణు చెప్పుకోచ్చాడు.

‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన వేణు ఉడుగుల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -