Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమాచివరి 40 నిమిషాలు..

చివరి 40 నిమిషాలు..

- Advertisement -

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.
వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెల 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రానుంది.
ఈ నేపథ్యంలో శనివారం సినిమా జర్నలిస్ట్‌ల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఘనంగా జరిగింది.
కో ప్రొడ్యూసర్‌ తాడాల వీరభద్రరావు మాట్లా డుతూ,’రఘు కుంచె మంచి మ్యూజిక్‌తో పాటు ఈ సినిమాలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటారు. ప్రేక్షకులకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా’ అని తెలిపారు.
‘డైరెక్టర్‌ చైతన్య మోటూరి మా అబ్బాయి. ట్రైలర్‌ చాలా బాగుందని ప్రశంసలు వస్తు న్నాయి’ అని ప్రొడ్యూసర్‌ వాణి రవికుమార్‌ మోటూరి చెప్పారు.
నటుడు, సమర్పకులు రఘు కుంచె మాట్లా డుతూ, ‘మా మూవీలో మంచి కంటెంట్‌ ఉందని మేము నమ్ముతున్నాం. ఈ ట్రైలర్‌తో మా మూవీ మీద మీకొక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది’ అని తెలిపారు. ‘ఒక మర్డర్‌ మిస్టరీని, ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ను రెండు గంటల ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్‌గా తెరకెక్కిం చాం. సినిమా చివరి 40 నిమిషాలు చాలా స్ట్రాంగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మేము ప్రేక్షకుల డబ్బుని, సమయాన్ని వథా చేయాలనుకోవడం లేదు’ అని డైరెక్టర్‌ చైతన్య మోటూరి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -