నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టెండర్ల విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. పక్షపాతం లేదా విధానపరమైన లోపాలు నిరూపితమైతే తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది. ఇప్పటికే జారీ చేసిన టెండర్లను రద్దు చేసి కొత్తగా పిలిచే అధికారం టెండరింగ్ సంస్థకు ఉంటుందని పేర్కొంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో వేములవాడ పరిసరాల్లో చేపట్టనున్న రూ.50 కోట్ల రోడ్ల విస్తరణ పనుల టెండర్లపై శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
26న హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు
హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలను ఈనెల 26న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. మంగళవారం నుంచి 12 వరకు నామినేషన్లు స్వీకరిస్తామనీ, 13న ఉపసంహరణకు అవకాశం ఉంటుందని బార్ అసోసియేషన్ తెలిపింది. 26న పోలింగ్ జరగనుందని పేర్కొంది. రిజర్వేషన్‌లో భాగంగా అదనపు కార్యదర్శి, రెండు ఎగ్జిక్యూటివ్ సభ్యుల స్థానాలను మహిళలకు కేటాయించినట్టు తెలిపింది. ఇదే సమయంలో జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయి.
టెండర్ల వ్యవహారంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదే : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



