నవతెలంగాణ – బిచ్కుంద
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఓటర్ లిస్ట్ జాబితా తుది జాబితా ముగింపు దశకు చేరుకుంది. బిచ్కుంద పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ హయ్యూం తన సిబ్బందితో కలిసి వార్డుల వారీగా తుది ఓటర్ లిస్ట్ జాబితా ప్రకటించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ముసాయిదా ఓటర్ లిస్ట్ జాబితాలోని లోపాలపై కొద్ది రోజులుగా వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సవరించారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో 25 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి సవరించారు. పోలింగ్ స్టేషన్లో వివరాలతో పాటు ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ఈనెల 16న విడుదల చేసి వార్డులలోని పోలింగ్ స్టేషన్ లవారీగా తుది జాబితాను ప్రచురించనున్నారు.ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు శివాని, వీరారెడ్డి, విశాల్, కంప్యూటర్ ఆపరేటర్ సంజీవ్, మహేష్ అధికారులు ఉన్నారు.
వార్డుల వారిగా తుది ఓటర్ లిస్టు జాబితా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



