Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయందేశంలోనే తొలి హైస్పీడ్‌ మెట్రో

దేశంలోనే తొలి హైస్పీడ్‌ మెట్రో

- Advertisement -

యూపీ మీరట్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ

మీరట్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని శతాబ్ది నగర్‌ స్టేషన్‌ నుంచి మెట్రో, నమో భారత్‌ రైళ్లను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో తొలిసారి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమైన మెట్రో సర్వీసు ఇది. హైస్పీడ్‌ ఇంటర్‌సిటీ ప్రయాణానికి ఇది కీలకం కానుంది. ఈ సందర్భంగా 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్‌ నమో భారత్‌ కారిడార్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. భారత్‌లోని తొలి నమో భారత్‌ ప్రాంతీయ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ సెక్షన్‌లను ప్రారంభించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నమో భారత్‌ భారత తొలి ప్రాంతీయ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ వ్యవస్థ. అలాగే రూ.12,930 కోట్ల
అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రైళ్లను ప్రారంభించిన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని మోడీ.. మీరట్‌ సౌత్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో విద్యార్థులు, అధికారులతో ముచ్చటిస్తూ ప్రయాణించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచస్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్‌ పార్టీ మురికి, సిగ్గులేని రాజకీయాలకు వేదికగా మార్చిందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -