Thursday, January 22, 2026
E-PAPER
Homeసినిమాతొలి భారతీయ సినిమా 'మరొక్కసారి'

తొలి భారతీయ సినిమా ‘మరొక్కసారి’

- Advertisement -

సీకే ఫిల్మ్‌ మేకర్స్‌ బ్యానర్‌పై బి. చంద్రకాంత్‌ రెడ్డి నిర్మిస్తున్న ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మరొక్కసారి’. నితిన్‌ లింగుట్ల రచన, దర్శతక్వంలో సినిమా రూపొందుతోంది. నరేష్‌ అగస్త్య, సంజనా సారథి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్‌ చేయటానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. రొటీన్‌ సినిమా మేకింగ్‌ సరిహద్దులను దాటి మేకర్స్‌ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా రూపొందించారు. రిచ్‌ విజువల్స్‌ లొకేషన్స్‌లో బలమైన ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో చూపించటానికి డిఫరెంట్‌ లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించారు. కేరళలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాల నడుమ ఈ సినిమాను చిత్రీకరించారు. అలాగే టిబెట్‌ సరిహద్దుకు దగ్గరలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో.. గురుడోంగ్మార్‌ సరస్సు వద్ద కూడా ఈ సినిమాను తెరకెక్కించారు.

సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్‌ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది. కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్‌ సమయాల్లో, అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ కంప్లీట్‌ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ పూర్తైంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వర్క్‌ జరుగుతోంది. ఓ మంచి కథను ప్రేక్షకులకు చెప్పేందుకు ఈ సినిమాని కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో నిర్మించాం. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తాం. ఈసినిమా తప్పకుండా అందర్నీ అలస్తుందనే నమ్మకం ఉంది అని నిర్మాత బి.చంద్రకాంత్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -