Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమొదటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి

మొదటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి

- Advertisement -

– ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్‌
– లబ్దిదారునికి పొట్టేలు, పట్టు వస్త్రాలందజేత
– ఆలేరు నియోజకవర్గం సైదాపురంలో కార్యక్రమం
నవతెలంగాణ-ఆలేరు

రాష్ట్రంలో మొదటి ఇందిరమ్మ ఇంటిని యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని సైదాపురంలో బుధవారం ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతో కలిసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ఎగ్గిడి మల్లేష్‌ దంపతులకు పట్టు వస్త్రాలు, గొర్రె పొట్టేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో పదేండ్లపాటు రాష్ట్రం వెనుకబడిందన్నారు. రాష్ట్రంలోనే ఆలేరు నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న బాల మల్లేష్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లబ్దిదారులంతా త్వరితగతిన ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వచ్చే నెల రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మొట్టమొదటగా ఎవరు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినా గొర్రె పొట్టేలుతోపాటు పట్టు వస్త్రాలు బహుకరిస్తానని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ప్రకటించారు. మంత్రి ముందుగా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. కలెక్టర్‌ హనుమంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, దేవస్థానం ఈవో వెంకట్రావు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అందెం సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జనగాం ఉపేందర్‌రెడ్డి, పల్లె శ్రీనివాసుగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈరసారపు యాదగిరి, నార్మల్‌ చైర్మెన్‌ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ అయినాల చైతన్య మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -