ఈ పంచాయతీలో అత్యల్పంగా 186 ఓట్లే..
నవతెలంగాణ – మల్హర్ రావు
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మండలంలోని మొత్తం15 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటికే చిన్నతూండ్ల, దుబ్బపేట పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగతా 13 గ్రామాల్లో ఈ నెల 17న ఎన్నికల సంగ్రామం జరగనుంది.13 గ్రామాలకు 42 మంది సర్పంచ్ అభ్యర్థులు, మొత్తం 128 వార్డుల్లో 26 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 102 వార్డులకు 237 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పలు హామ్లెట్లు,తండాలకు జీపీ హోదా లభించగా..గ్రామాల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతి తక్కువ ఓట్లు ఉండడమే ఇందుకు కారణం మండలంలోని మల్లంపల్లి తండాలో అత్యల్పంగా 186 ఓటర్లు ఉండగా.. ఇక్కడే తొలి ఫలితం రానున్నట్లు తెలుస్తోంది.అత్యధికంగా తాడిచెర్లలో 6,537 ఓటర్లు ఉండడంతో ఫలితాలు అలస్యమయ్యే అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన దుబ్బపేటలో 211, మల్లంపల్లి తండా తరువాత ఇప్పలపల్లిలో 519, ఉండగా మిగతా గ్రామాల్లో ఆరు వందలకు పైగానే ఓటర్లు ఉన్నారు.



