Wednesday, March 4, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: మ‌రికొన్ని గంట‌ల్లో తొలి సెమీ పోరు

T20 WORLD CUP: మ‌రికొన్ని గంట‌ల్లో తొలి సెమీ పోరు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి సెమీ పోరు మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభంకానుంది. క‌ల‌క‌త్తాలోని ఈడెన్ గార్డ్స్‌ స్టేడియం వేదిక‌గా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య‌ ఫైన‌ల్ బెర్తు కోసం ఢీకొనున్నాయి. ఇరు జ‌ట్ల బ‌లబ‌లాలు ప‌రంగా ఎవ‌రి లెక్క‌ల వారికి ఉన్నా..తాజా టీ20 మెగా టోర్నీ ప్ర‌కారం స‌ఫారీలు ముందంజ‌లో ఉదంటే అతిశ‌యోక్తి కాదు. మెగా టోర్నీలో ఓట‌మి ఏరుగ‌ని జ‌ట్టుగా రికార్డ్ న‌మోదు చేసింది.

మొత్తం ఏడు ఆఖండ విజ‌యాల‌ను సాధించింది. గ్రూప్ ద‌శ లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టీం దుమ్మురేపింది. కెన‌డా, ఆఫ్గాన్, యూఏఈల‌తో పాటు, న్యూజిలాండ్ టీంల‌ను కూడా ఓడించింది. ఆ త‌ర్వాత సూప‌ర్-8లో టైటిల్ ఫేవ‌రేట్ టీం లైనా ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వేల‌ను మ‌ట్టిక‌రిపించింది. అంతేకాకుండా 2024లో ద‌క్షిణాఫ్రికా తృటిలో క‌ప్ కోల్పోయి..ర‌న్న‌ర్ గా నిలిచింది. తాజా విజ‌యాల ప‌రంప‌ర‌తో అదే ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగించాల‌ని మార్క్‌క‌ర‌మ్ సేన దృఢ సంక‌ల్పంతో ఉన్నంది.

మొత్తం టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడినా న్యూజిలాండ్.. రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చెంద‌గా, నాలుగింటిలో విక్ట‌రీ సాధించింది. మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయింది. గ్రూప్ ద‌శ‌లో కూడా సౌతాఫ్రికాపై కివీస్ ప‌రాజ‌యం పొందింది. ఆ త‌ర్వాత సూప‌ర్‌-8 పోరులో పాక్‌తో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కాగా..ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా టీంల‌పై ఓట‌మి చ‌వి చూసింది. గ్రూప్ ద‌శ‌లో సఫారీ టీంపై ఓడినా కివీస్..తాజా మ్యాచ్‌లో ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -