Sunday, September 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వరద పోయింది.. బురద మిగిలింది

వరద పోయింది.. బురద మిగిలింది

- Advertisement -
  • – ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
    నవతెలంగాణ -ముధోల్
  • బాసర గోదావరి ఉధృతంగా గత నాలుగు రోజులుగా ప్రవహించింది.ఆదివారం ఉదయం వరకు క్రమక్రమంగా గోదావరి శాంతించింది. వరద పోయి బురద, చెత్తా మిగిలిందని పలువురు పెదవి విరుస్తున్నారు బాసర  గోదావరి వరదతో బాసర ఆలయ పరిసరాల్లో ఉన్న నివాస గృహాలు, లాడ్జ్ లు నీట మునిగిన విషయం తెలిసిందే. గోదావరి ఉధృతి  క్రమక్రమంగా తగ్గడం తో ఆదివారం బాసర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.  బాసర ఆలయ పరిసరాలు,పలు కాలనీలు యదావిధిగా సాధారణ పరిస్థితి నెలకొంది.కేవలం ఆలయం నుండి గోదావరి వైపు కు వెళ్ళే మార్గం లోతట్టు ప్రాంతం కావటంతో కోంతమేర నీళ్ళు ఉన్నాయి.  బారీ స్థాయిలో నీళ్ళు చేరటంతో ఆ నీళ్ళు తగ్గిపోవడంతో  ఆలయ పరిసరాలు, కాలనీలో ,భారీ స్థాయిలో చెత్త చెదారం, పాటు అక్కడక్కడా  బురద మయంగా కనిపించింది . నీట మునిగిన ఇండ్లు, లాడ్జ్  నిర్వాహకులు తమ ఆవరణలో వరదతో ఏర్పాడ్డ బురద,చెత్త చెదారంను  తోలగించి శుభ్రం చేసుకుంటున్నారు‌. వరద కు గురైన కాలనీలు,ఆలయ పరిసరాల్లో తక్షణమే పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నివారణ కు చర్యలు తీసుకుంటున్నారు. దోమలు పెరిగిపోవడంతో పాటు పారిశుద్ధ్య లోపం నెలకొనే సమస్య  ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండటంతో  ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ విషయంపై  బాసర పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గౌడ్  నవతెలంగాణ తో  ఆదివారం మాట్లాడారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా  అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు .వరద తో  పేరుకపోయిన చెత్తాచెదారాన్ని ఆదివారం ఉదయం నుండే పారిశుద్ధ కార్మికులు తొలగిస్తున్నారని తెలిపారు. సోమవారం కల్లా పారిశుద్ధ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దోమల నివారణకు చర్యలు  తీసుకుంటున్నామన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -