Wednesday, February 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్యూచర్‌ సిటీపై ఉన్న ధ్యాస.. పేదల హెల్త్‌ సిటీ పై లేదు

ఫ్యూచర్‌ సిటీపై ఉన్న ధ్యాస.. పేదల హెల్త్‌ సిటీ పై లేదు

- Advertisement -

కమీషన్లు తెచ్చే రియల్‌దందా పైనే సీఎంకి శ్రద్ధ
దేవాదుల ప్రాజెక్టును ఆగం చేస్తున్నారు
పనులు పూర్తి చేయకుంటే వరంగల్‌ గడ్డపై నిరాహార దీక్ష : మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు
వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ
ఆస్పత్రి పనుల పరిశీలన
నవతెలంగాణ-వరంగల్‌

సీఎం రేవంత్‌ రెడ్డికి కమీషన్లు తెచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఫ్యూచర్‌ సిటీ మీద ఉన్న ధ్యాస పేదలకు ప్రాణం పోసే వరంగల్‌ ‘హెల్త్‌ సిటీ’ మీద లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ జిల్లాలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకో డెడ్‌ లైన్‌, ముఖ్యమంత్రికో డెడ్‌ లైన్‌ పెడుతూ దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్‌ సర్కార్‌ ఆగమాగం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను కావాలనే నత్తనడకన సాగిస్తున్నారని తెలిపారు. వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్‌ పక్షాన వరంగల్‌ గడ్డపైనే నిరాహారదీక్షకు దిగుతామని సవాల్‌ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్‌ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలన్నారు. నాడు కేసీఆర్‌ హయాంలో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసిన ఎంజీఎం ఆస్పత్రి నేడు కాంగ్రెస్‌ పాలనలో ఎలుకలు, పందికొక్కులకు అడ్డాగా మారిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు మానుకొని ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, రవీందర్‌ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినరు భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, అరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, శంకర్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -