బిఎస్పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి అయితరాజు అభయేందర్
నవతెలంగాణ – చండూరు
మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ దుకాణాల మీద ఉన్న శ్రద్ధ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజా సమస్యల మీద లేదు అని బి.ఎస్.పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి అయితరాజు అభయేందర్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వైన్స్ దుకాణదారుల పై ఆంక్షలు పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.
ఈ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారుఅన్నారు. నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యతో సతమతమవుతున్నారని ఆయన ఆరోపించారు. విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరిగి యువత చెడిపోతున్న పరిస్థితి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఈ మధ్యకాలంలో ఫర్టిలైజర్ వికాస్ యోజన ఆఫ్ తీసుకు రావటం వలన రైతులు తమ పంట పొలాలకు యూరియా సకలంలో వెయ్యటానికి ఇబ్బంది పడుతున్నారు అన్నారు.
గతంలో ఎలాంటి నిబంధన లేకుండా యూరియా రైతులకు నేరుగా ఇచ్చేది, ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ వలన రైతులు ఆన్లైన్ విధానం చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ లేక, అవగాహన లేక పోవటం వలన స్లాట్ బుక్ చేసే వారితో ఇబ్బంది పడుతున్నారు. శేర్లగూడెం రిజర్వాయర్ కింద ఇండ్లు, భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇంకా అందించలేదన్నారు. మునుగోడులో ఉన్న అన్ని సమస్యలపై సమగ్రంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.



