నందీశ్వరుడు, అభయాంజనేయుడు పున:ప్రతిష్టాపనలు
సందర్శకులతో కిక్కిరిసిన పురాతన ఆలయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి, భూపాలపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లోని మానేరు ఒడ్డున చంద్రవెళ్లి పురాతన ఆలయాలకు పూర్వవైభవం వెల్లివిరిసింది. ఆలయాల అభివృద్ధికి కాకతీయ కాలంనాటి సమ్మక్క, సారలమ్మ రాణుల వలే ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధికలు కంకణం కటుకున్నారనే అనేలా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శివలింగేశ్వర స్వామి ముందు నందీశ్వరుడు విగ్రహ పున:ప్రతిష్టాపన, శ్రీ మాల, విరామాల అభయఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమాలు అంగరంగవైభవంగా నిర్వహించారు.
వేదపండితుల మంత్రోత్సవంతో విగ్రహాలను పునప్రతిష్టపానలు చేశారు. ఈ వైభవాన్ని తిలకించడానికి తాడిచెర్ల, ఖమ్మంపల్లి, మంథని, గోదావరిఖని, ఓడేడ్, ముత్తారం, అడవిశ్రీరాంపూర్ తదితర గ్రామాలు, పట్టణాల నుంచి సందర్శలు అధికసంఖ్యలో హాజరయ్యారు. భక్తజనంతో పురాతనమైన సందరెల్లి ఆలయాలు కిక్కిరిశాయి. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చల్లని తాగునీరు, పులిహోర ప్యాకేట్స్, స్వీట్స్, అరటి పండ్లు అందజేశారు.



