Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి

ఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి

- Advertisement -

శతజయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రైతాంగసాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడు, ఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి సందర్భంగా తెలంగాణ, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి అని తెలిపారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి అని పేర్కొన్నారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి, అనునిత్యం సమసమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి దాశరథి అని తెలిపారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు సినిమా సాహిత్యంలోనూ విశిష్ట స్థానం సంపాదించారని వివరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దాశరథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రజాప్రభుత్వం ఘనంగా సన్మానించిందనీ, చేయూతనందించిందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -