Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతక్షణమే నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి

తక్షణమే నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి

- Advertisement -

– కార్మికుల హక్కులను కాలరాయొద్దు
– రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించాలి
– రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు
– కలెక్టరేట్ల ఎదుట బ్లాక్‌ డే..
– సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన

కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ.. కార్పొరేట్ల లాభాల కోసం రూపొందించిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కార్మిక లోకం డిమాండ్‌ చేసింది. ‘మా హక్కులను కాలరాయొద్దు.. యాజమాన్యా లకు బానిసలుగా మార్చొద్దు..’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న నాలుగు లేబర్‌కోడ్‌లు కార్మికవర్గంపై తీవ్రమైన దాడి అని, ఇది చట్టాల మార్పుకాదు, కార్మిక హక్కుల అపహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిలో నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో లేబర్‌కోడ్‌లపై నిరసన కార్యక్రమాలు జరిగాయి.
నవతెలంగాణ- విలేకరులు
మంచిర్యాల జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. సింగ రేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వ ర్యంలో మందమర్రి ఏరియాలోని పలు గనుల్లో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నల్లజెండాలు, ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్‌లోనూ సీఐటీయూ హమాలీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు గోమాస ప్రకాష్‌ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా నస్పూర్‌, సీసీసీ రైస్‌ మిల్స్‌ వద్ద హమాలీలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌ఎంఎస్‌ నాయ కులు ఎస్టీపీపీ కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 44 కార్మిక చట్టాలకు బదులుగా నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాసిపేట పరిధిలోని 2 ఇంక్లైన్‌గనిపై కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యం లో నాలుగు లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట బ్లాక్‌ డే పాటించారు. కార్మి కులు 100ఏండ్లకు పైబడి పోరాడి సాధించుకున్న 44చట్టా లను కుదించి నాలుగు కోడ్‌లుగా తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపక్షాన ఉంటే అసెం బ్లీలో వెంటనే లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోమని తీర్మా నం చేయాలని డిమాండ్‌ చేశారు. కుమురం భీం ఆసిఫా బాద్‌ జిల్లా కేంద్రంలో బ్లాక్‌ డేగా పాటిస్తూ ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కాగజ్‌నగర్‌ పట్టణలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. సిర్పూర్‌(టి) మండలంలో కార్మికులు బ్లాక్‌ డే పాటించారు. పలు పని ప్రదేశాల్లో కార్మికులు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ‘ది సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌-1976’ను యథావిధి గా కొనసాగించాలని కోరారు. కార్మిక హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్మికులు దీర్ఘకాలిక సమ్మె పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. రామగుండంలో సింగరేణి బొగ్గు గనుల ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లరిబ్బన్‌లు పెట్టుకుని నిరసన తెలిపారు.

ఖమ్మం నగరంలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కారేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర సన తెలిపి.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎదు లాపురం, కల్లూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బోనకల్‌లో బస్టాండ్‌ సెంటర్లో పెద్దఎత్తున నిరసన తెలి పారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయా లని, వాటిని అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం చేయాలని, ఆర్టీసీ కార్మిక ఉద్యమంపై ఆంక్షలు ఎత్తే యాలని డిమాండ్‌చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు బ్లాక్‌డే పాటిం చారు. ఆర్టీసీడిపో ఎదురుగా నల్ల రిబ్బర్‌ను ధరించి నిరసన తెలిపారు. ఇల్లందులో, భద్రాచలం అంబేద్కర్‌ సెంటర్లో లేబర్‌ కోడ్‌ పత్రాలను దహనం చేశారు.

ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణం లోని సుభాష్‌ విగ్రహం వద్ద బ్లాక్‌ డేగా పాటిస్తూ నిరసన తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. చిట్యాల, వెలిమినేడు, నకిరే కల్‌ పట్టణంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నకిరేకల్‌ పట్టణంలో సీఐటీయూ నిరసన ప్రదర్శన నిర్వ హించారు. మర్రిగూడ, నార్కట్‌పల్లిలో నల్లజెండాలు పట్టు కుని నిరసన తెలిపారు. కొత్తగూడెం గోదాంలో హమాలీలు నిరసన తెలిపారు. దామరచర్ల మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. దేవరకొండలో ఆర్డీఓ రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మహబూబ్‌నగర్‌ జల్లా కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. జోగులాంబ గద్వాల లోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో లంచ్‌ అవర్‌ డెమోస్టేషన్స్‌ నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో తోపుడు బండ్ల కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ. టీయూసీఐ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ పార్కు దగ్గర నిరసన తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌ దగ్గర నరసన తెలిపారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నాలుగు లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిస్తూ బ్లాక్‌ డే పాటించారు. సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లతో ఉద్యోగులకు హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానం అమల్లోకి వచ్చిం దన్నారు. కార్మిక హక్కులను రద్దు చేస్తూ యాజమాన్యాలకు హక్కులను కట్టబెట్టే పద్ధతిలో నరేంద్రమోడీ ప్రభుత్వం ముఖ్యంగా 29రకాల చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లు అమలులోకి తీసుకొచ్చిందని ఆరోపించారు. మెదక్‌, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -