- Advertisement -
రెడ్‌సెల్యూట్ చెప్పిన మహాసభ
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలో ఆ యూనియన్ నుంచి నలుగురు సీనియర్ నేతలు రిలీవ్ అయ్యారు. వారిలో ఆర్.లక్ష్యయ్య, అమితవ్‌గుహ, సుభాష్ ముఖర్జీ, జేఎస్.మజుందార్‌లను కార్యవర్గం నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ కార్మిక నేతల కార్మిక ఉద్యమ సేవలను మహాసభ గుర్తు చేసుకుంది. నూతన అధ్యక్ష, కార్యదర్శులు రిలీవ్ అయిన సీనియర్ నేతలకు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారికి రెడ్ సెల్యూట్ చేస్తూ మహాసభలోని ప్రతినిధులంతా నినాదాల హోరెత్తించారు.
- Advertisement -



