Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎంవీఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో ఉచిత కంటి పరీక్షలకు మంచి స్పందన

ఎంవీఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో ఉచిత కంటి పరీక్షలకు మంచి స్పందన

- Advertisement -

వాసన్‌ ఐ కేర్‌ ఆస్పత్రి సహకారంతో నిర్వహణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంలో గల ఎంహెచ్‌ భవన్‌లో ఉన్న మల్లు వెంకట నరసింహారెడ్డి (ఎంవీఎన్‌ఆర్‌) స్మారక ఆస్పత్రిలో సోమవారం హిమాయత్‌నగర్‌ వాసన్‌ ఐ కేర్‌ ఆస్పత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నవతెలంగాణ సిబ్బంది, కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వాసన్‌ ఐ కేర్‌ ఆస్పత్రి డాక్టర్లు రమేష్‌, హాజి పర్యవేక్షణలో సుమారు 80 మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ కె ఆనందాచారి, నవతెలంగాణ జనరల్‌ మేనేజర్లు భరత్‌, వెంకటేశ్‌, శశిధర్‌, రఘు, నరేందర్‌రెడ్డి, పవన్‌, బోర్డు సభ్యులు మోహన్‌కృష్ణ, సలీమ, మేనేజర్‌ వీరయ్య, ఎంవీఎన్‌ఆర్‌ ఆస్పత్రి ప్రతినిధి విజయ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -