Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి

- Advertisement -

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌
ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ- దామరగిద్ద
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో మోడీ, ట్రంప్‌ల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన జరుగు దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, యువజనులు, మహిళలు, మేధావులు, సామాజిక తరగతులు భాగస్వాములు కావాలని కోరారు. దేశ స్వాతంత్య్రాన్ని ,సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు.

ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయన్నారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తున్నదన్నారు. మనదేశంలో మన వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తోందన్నారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌక అని అన్నారు. 65శాతం జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం దివాళా తీస్తుందన్నారు. ఈ విధానాలకు నిరసనగా గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, జోషి, శివకుమార్‌, దస్తప్ప, ప్రకాష్‌, మల్లేష్‌, విజయ్ బాబు, వెంకటేష్‌ మోహన్‌, మహేష్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

బీబీనగర్‌, చిట్యాలలో…
అమెరికాతో భారత్‌ చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు సుంకాలను వ్యతిరేకిస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలకేంద్రంలో బ్రాహ్మణపల్లి కూడలి వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ట్రంప్‌ , మోడీ రెండు తలకాయల దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలకేంద్రంలో మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మలను సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దహనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -