Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeసినిమాభయపెట్టే 'కిష్కిందపురి'

భయపెట్టే ‘కిష్కిందపురి’

- Advertisement -

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న హర్రర్‌-మిస్టరీ థ్రిల్లర్‌ ‘కిష్కిందపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది.
ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.
బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్‌ సస్పెన్స్‌ మరింత పెంచింది, ఆయన ముందు ఒక వింటేజ్‌ రేడియో విరిగి ఎగిరిపోతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెర్రిఫిక్‌ మాన్షన్‌తో పాటు మంటల్లో కాలి పోతున్న వ్యాన్‌ కనిపించడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఫస్ట్‌ గ్లింప్స్‌లోనే ప్రేక్షకులు సినిమా సస్పెన్స్‌ ప్రిమైజ్‌ని ఫీల్‌ అయ్యారు. తాజాగా రిలీజ్‌ అయిన ఫస్ట్‌ సింగిల్‌ ‘ఉండిపోవే నాతోనే’ మాత్రం పూర్తిగా వేరే మూడ్‌ సెట్‌ చేసింది. కథలో టెన్షన్‌తో పాటు ఒక రొమాంటిక్‌ షేడ్‌ని ప్రజెంట్‌ చేసింది.
డైరెక్టర్‌ కౌశిక్‌ పెగళ్లపాటి, కిష్కిందపురి డార్క్‌, మిస్టీరియస్‌ వరల్డ్‌ను చూపిస్తూ, దానికి కాంట్రాస్ట్‌గా ఎమోషనల్‌ మూమెంట్స్‌ని చక్కగా మిక్స్‌ చేశారు. కథ ముందుకు సాగే కొద్దీ థ్రిల్ల్స్‌తో పాటు ఎమోషన్స్‌ కలిసిన లేయర్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది అని చిత్రయూనిట్‌ తెలిపింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – కౌశిక్‌ పెగల్లపాటి, నిర్మాత – సాహు గారపాటి, సమర్పణ – అర్చన, సంగీతం – సామ్‌ సిఎస్‌, డీఓపీ – చిన్మరు సలాస్కర్‌,
ప్రొడక్షన్‌ డిజైన్‌ – మనీషా ఎ దత్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – డి శివ కామేష్‌, ఎడిటర్‌ – నిరంజన్‌ దేవరమానే, సహ రచయిత – దరహాస్‌ పాలకొల్లు, స్క్రిప్ట్‌ అసోసియేట్‌: కె బాల గణేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – టి సందీప్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad