Wednesday, February 25, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

అశ్వారావుపేట భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

- Advertisement -

– అన్ని వార్డుల్లో సీపీఐ (ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థలదే విజయం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మున్సిపాలిటీ భవిష్యత్తు ఓటర్లు చేతుల్లోనే ఉందని, సీపీఐ (ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థలదే అన్ని వార్డుల్లో విజయం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం 17 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చారుగుండ్ల లక్ష్మీ శైలజ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేదమధ్యతరగతి కుటుంబాల సంక్షేమం ఇవన్నీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలని తెలిపారు.17 వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమదేనని,ప్రజల సహకారంతో అశ్వారావుపేటను ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చారుగుండ్ల లక్ష్మీ సౌభాగ్య గారికి ఓటు వేసి ఘన విజయం అందించాలని ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -