విక్రం మంచి అబ్బాయి. మంచి బడిలో చదువుతున్నాడు. కానీ ఉదయాన్నే లేవటం ఇష్టం లేదు, స్కూల్ బ్యాగ్ క్లీస్ చేసుకోవడం బోర్. హోమ్ వర్క్ అంటే చిరాకు. ఒక రోజు టీచర్ మందలించింది. వెంటనే ఇంటికొచ్చి అమ్మతో… ”అమ్మా! టీచర్ నన్ను తిట్టింది!”
అమ్మకి వెంటనే టెన్షన్. నాన్నకి చెప్పింది. నాన్న మెల్లగా విక్రం వైపు చూశాడు.
”మమ్మీ, టీచర్ నన్ను తిట్టింది!” అని చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించు బాబూ… నువ్వు ఏం చేశావో!” అన్నాడు నాన్న.
విక్రం కొంచెం గాబరాపడ్డాడు. నాన్న మెల్లిగా చెప్పాడు… టీచర్ అంటే భయం కాదు బాబు… గౌరవం వుండాలి”.
విక్రం అసహ్యంగా ఫీలయ్యాడు. నాన్నతో మాటలాడటం మానేశాడు.
అప్పుడు తల్లిదండ్రులు ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకొచ్చారు. నేను విక్రం వైపు చూసి నవ్వుతూ అడిగాను… ”ఓహో! నిన్ను టీచర్ తిట్టిందా? సరే… మీ డాడీ స్కూల్‌కి వెళ్లి మేడంని తిట్టిపారేస్తారు.”
విక్రం ఆశ్చర్యపోయాడు.
నేను నవ్వాను.
”ఒక్కసారి ఊహించు బాబు – నువ్వే టీచర్ అయితే? నీకెవడైనా ఇలా చేసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు?”
”ఈ ప్రశ్నకు వెంటనే చెప్పొద్దు, రెండు రోజులు ఆలోచించు.”
రెండు రోజులు గడిచిన తర్వాత విక్రం నా దగ్గరకు వచ్చి… ”సారీ మేడం” అన్నాడు తలవంచి.
”నాకు కాదు బాబూ… మీ టీచర్‌కి చెప్పు!” అన్నాను.
వెంటనే విక్రం ”కాని… టీచర్ ఎందుకు అని అడుగుతారు కదా?” అన్నాడు.
”చెప్పాలనిపించింది చెప్పాను” అని చెప్పు అన్నాను.
అయితే డాడీకి కూడా అన్నాడు.
ఓకే…
పిల్లల్ని తప్పు చేసిన ప్రతిసారి ”తిట్టారు, కొట్టారు” అని కాపాడితే, వాళ్లకు బాధ్యత తెలియదు.
వారి మనసులోని సమాధానాల్ని వాళ్ళే ఆలోచించేందుకు అవకాశం ఇస్తే వారు మారతారు.
నేటి బడులు గొప్పగా ఉంటున్నా, పిల్లల నడవడిక, హెయిర్ స్టైల్ చూసి కొంత మంది టీచర్లు చేతులు ఎత్తేశారు! ఎందుకంటే ఎంత చెప్పినా వినడం లేదు! ఇంట్లో తల్లిదండ్రులూ సైలెంట్! పిల్లలు తప్పు చేసినా ”మా బాబు ఇంకా పిల్లాడే సార్!” అంటున్నారు.
మరి పిల్లలకు భయం లేకుండా క్రమశిక్షణ ఎలా వస్తుంది?
మా కాలంలో టీచర్లు కొట్టేవాళ్లే, కానీ తల్లిదండ్రులు ‘మా పిల్లల బాగు కోసం’ అని అర్థం చేసుకునేవారు. మరి ఇప్పుడు?
తిట్టకూడదు! కొట్టకూడదు! ప్రేమతో చెప్పాలి!
అలాగేనండి, ప్రేమతోనే చెప్పాలి కానీ, పిల్లలు మారాలంటే మొదట తల్లిదండ్రులే మారాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్ సర్దక పోవచ్చు, కానీ మొబైల్ స్క్రీన్ తుడవడంలో చాంపియన్స్! ఇంటి పనిలో సాయం చేయరు, కానీ ఫ్రెండ్స్‌కు పార్టీలు ప్లాన్ చేస్తారు.
కొంతమంది పిల్లలు ఇలా ఉంటున్నారు:
– ఇంటి పనులంటే బోర్..
– పడుకోకుండా రాత్రివేళ ఫోన్లో బిజీ
– తెల్లవారితే లేవాలంటే బద్దకం
– మాట చెబితే ఎదురు మాట
– కాస్త కోపమొస్తే వస్తువులు విసిరేస్తారు
– బైక్‌లు, ట్రెండీ డ్రస్సులు, బీర్స్… ఇవే ఫ్యాషన్!
కానీ అసలు వాళ్ళకు ఏమి కావాలో వారికి తెలుసా ?
వారికి జీవితంలో ఎదగాలంటే కావాల్సింది:
– బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, ఓర్పు, సహనం, కుటుంబ అనుబంధం, దేశభక్తి, అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి, ఆరోగ్యం.
పిల్లలు తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ప్రేమతో. మాట వినకపోతే కాస్త గట్టి మాట అవసరమే. అది కష్టం కాదు. వారిని ప్రేమించాలంటే డిసిప్లిన్ నేర్పించాలి.
మరి ఇంకెందుకు ఆలస్యం? పిల్లల మనస్సులో ముద్రపడేలా…
– వారి ప్రతి విజయానికి పగ్గాలు
– ప్రతి తప్పుకు మార్గదర్శనం
– ప్రతి అడుగులో ఒత్తిడి కాకుండా, తోడు కావాలి
– పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, వాళ్లకు మంచి అలవాట్లు చెప్పాలి.
– మంచి భవిష్యత్తు – మన ఇంటి నుండి మొదలవుతుంది!
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
పిల్లల భవిష్యత్తు ఇంటి నుంచే
- Advertisement -
- Advertisement -