Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గచ్చుబావి రహదారి కటింగ్  చేసి, రైతాంగానికి నీళ్లు అందించాలి..

గచ్చుబావి రహదారి కటింగ్  చేసి, రైతాంగానికి నీళ్లు అందించాలి..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

రాయగిరి పరిధిలోని గచ్చుబాయి దగ్గర జాతీయ రహదారి రోడ్డును కటింగ్ చేసి, బస్వాపురం ప్రాజెక్టు నుండి నీళ్లు రావడానికి తీసిన కాల్వను పూర్తిచేసి భువనగిరి మండల పరిధిలోని గ్రామాల చెరువులు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శుక్రవారం సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో బస్వాపురం ప్రాజెక్టు కాలువ నీళ్లు పోవడానికి గచ్చుబావి దగ్గర జాతీయ రహదారి రోడ్డు కటింగ్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని సీపీఐ(ఎం) నాయకత్వం, రైతులతో కలిసి  పరిశీలన చేసి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా నర్సింహ  మాట్లాడుతూ.. ప్రాజెక్టు నుండి భువనగిరి మండలంతోపాటు వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని రైతాంగానికి సాగునీరు అందించడానికి ప్రధాన కాలువ పూర్తి అయి రెండు, మూడు సంవత్సరాలు గడుస్తున్న భువనగిరి ప్రధాన జాతీయ రహదారి రోడ్డు కటింగ్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేసి కాలువ నుండి కింది భాగం నీళ్లు పోవడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నర్సింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ కటింగ్ పనులు రెండు సంవత్సరాల నుండి ఎందుకు పూర్తి కావడం లేదని మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న స్థానిక శాసనసభ్యులు హామీ ఎందుకు అమలు కావడం లేదని అన్నారు.

జిల్లా అధికారులు, కాంట్రాక్టర్ ఎందుకు స్పందించి త్వరితగతిన పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా త్వరితగతిన పనులు పూర్తి చేసి పెంచికల్ పహాడ్, రామకృష్ణాపురం, బాలంపల్లి, రామచంద్రపురం, చందుపట్ల, వీరవెల్లి, గౌస్ నగర్ గ్రామాలకు సంబంధించిన చెరువులు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని సూచించారు. నీరు వస్తే భూమి సాగులోకి వచ్చి రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు పనులు దొరుకుతాయని దాని ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటారని తెలిపారు. ఇప్పటికైనా పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్ , మండల కమిటీ సభ్యులు సిలివెరు ఎల్లయ్య , పెంచిలపహడ్ శాఖ కార్యదర్శి సుబ్బురు పోషయ్య , సీపీఐ(ఎం) నాయకులు , రైతులు కొండ మహేష్ , డోప్ప యాదగిరి, డోప్ప రాములు, కోట సోమయ్య, బీమర ఉప్పలయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad