Thursday, February 5, 2026
E-PAPER
Homeసినిమాఉగాదికి గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులు ప్రదానం

ఉగాదికి గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులు ప్రదానం

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, దేశ వ్యాప్తంగా ఫిలిం ఇండిస్టీకి హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సెక్రటేరియట్‌లో గద్దర్‌ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి, వదిలేస్తే సమాజంలో అత్యంత ప్రభావం చూపే సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినీ రంగాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి తిరిగి ప్రోత్సహించడం ప్రారంభించింది . ప్రతిభ, పారదర్శకతలే ప్రమాణాలుగా ఈ అవార్డుల ఎంపిక ఉంటుంది. ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్‌ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈనెల 6 నుంచి గద్దర్‌ సినిమా అవార్డుల స్క్రీనింగ్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 19న ఉగాది పండుగ రోజు గద్దర్‌ అవార్డుల పంపిణీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప సందేశం ఇచ్చేలా గత సంవత్సరం ఎలాగైతే నిర్వహించామో, అదే రీతిలో ఈ ఏడాది కూడా గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించేందుకు ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌, ఐ అండ్‌ పీఆర్‌ శాఖలకు పూర్తి స్వాతంత్రం, అవసరమైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -